సిరా న్యూస్,హైదరాబాద్;
కూకట్ పల్లి లో పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి ఆకస్మిక పర్యటనచేసారు. మైసమ్మ చెరువు, ఐ డి ఎల్ చెరువు, సర్దార్ నగర్ లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. సర్దార్ నగర్ వరద ముంపు గురైన ప్రాంతాల్లో పర్యటించి ప్రజల తో మాట్లాడారు. ఇక నుండి వరద ముంపు కాకుండా నాలా పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు. ఐ డి ఎల్ చెరువు వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల ను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ముంపు గురైన కాలని వాసులకు సురక్షిత త్రాగు నీరు సరఫరా చేయాలని ,దోమల నివారణకు ఏ ఎల్ ఓ , ఫాగింగ్ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.