సిరాన్యూస్, ఓదెల
నక్కల వాగు వైపు ప్రయాణం చేయొద్దు : మాజీ సర్పంచ్ గోవింద్ రాయల స్వామి
ఓదెల- కాల్వశ్రీరాంపూర్, మండలాల మధ్యలో గూడెం, మల్యాల గ్రామాల మధ్యలో ఉన్న నక్కల వాగు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి వరదనీరు పెరిగి ఉదృతంగా ప్రవహిస్తోంది. రోడ్డు పై నుండి వరద నీరు పారుతోంది. ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు ఇటువైపు ప్రయాణం రద్దు చేసుకొని, వయా గుంపుల మీదుగా ఇందుర్తి పోత్కపల్లి జీలకుంట ద్వారా కాల్వ శ్రీరాంపూర్ వెళ్లాలని గూడెం మాజీ సర్పంచ్ గోవింద్ రాయల స్వామి ఒక ప్రకటనలో తెలిపారు.