సిరా న్యూస్,విజయవాడ;
బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో నిర్వాసితుల సహాయార్థం మార్కెటింగ్ శాఖ యాపిల్ పండ్లు, అరటి పండ్లు పంపిణీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతో మార్కెటింగ్ డైరెక్టర్ విజయ సునీత 1.10 లక్షల యాపిల్ పండ్లు, 90 వేల అరటి పండ్లు సేకరించి ముంపు ప్రాంతాలకు పంపారు. రానున్న రెండు రోజులు రోజుకు 2.5 లక్షల అరటి పండ్లు చొప్పున ముంపు ప్రాంతాల్లో బాధితులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు మార్కెటింగ్ డైరెక్టర్ విజయ సునీత పేర్కొన్నారు..