సిరాన్యూస్, ఓదెల
మానేరు నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి : తహసీల్దార్ యాకన్న
పెద్దపల్లి జిల్లా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఓదెల మండలంలోని గ్రామాలు కనగర్తి, మడక, పోత్కపల్లి, రూప్ నాయరాయణ పేట, ఇందుర్తి, గుంపుల గ్రామ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ యాకన్న అన్నారు.లోయర్ మానేరు డ్యామ్ ఎగువ పరివాహక ప్రాంతాలలో ఉత్తర తెలంగాణాలో అతిభారీ వర్ష సూచన కారణంగా ఏక్షణం లోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, నీటిని దిగువకు వదిలే అవకాశం ఉందని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గ్రామాలలో దండోరా వేయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులు గాని ,గొర్రెలు మొదలగునవి వెళ్లకుండా అలాగే చేపలు పట్టేవారు, గొర్రె కాపరులు రైతులు వెళ్లకుండా ఉండాలని తెలిపారు.