Tehsildar Yakanna: పౌర హక్కులకు భంగం కలిగించొద్దు : త‌హ‌సీల్దారు యాకన్న

సిరాన్యూస్‌, ఓదెల
పౌర హక్కులకు భంగం కలిగించొద్దు : త‌హ‌సీల్దారు యాకన్న
* మడకలో పౌర హక్కుల దినోత్సవం

సమాజంలో ఎవరి హక్కులకూ భంగం కల్గించొద్దని త‌హ‌సీల్దారు యాకన్నఅన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో దళిత కాలనీలో త‌హ‌సీల్దార్ యాకన్న పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా త‌హ‌సీల్దార్ మాట్లాడుతూ జాతి ,కులం, మతం వివక్షత లేకుండా అందరూ సమానులే అనే ఆలోచన కలగాలని తెలిపారు. కార్యక్రమంలో మడక దళిత కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *