సిరా న్యూస్,హైదరాబాద్;
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా కార్యాచరణ వుంటుందని గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం అయన పేదలకు ఇళ్ల కేటాయింపుపై సమీక్ష నిర్వహించారు. ఇండ్ల నిర్మాణానికి 3, 4 నమూనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణ సంస్థ పునరుద్ధరణకు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం రోడ్లు, భవనాల శాఖలో గృహనిర్మాణ శాఖ వుంది. ఇతర శాఖల నుంచి సిబ్బందిని తీసుకోవాలని నిర్ణయించారు. -ఇందిరమ్మ ఇళ్లపై త్వరలోనే సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం సమీక్ష తర్వాత ఇండ్ల నిర్మాణానికి విధివిధానాలు ఖరారు చేస్తామని మంత్రి వెల్లడించారు.