సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి కలెక్టరేట్ లో ధాన్యం రవాణా గోనే సంచుల రవాణా టెండర్ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. లోకల్ నాన్ లోకల్ కాంట్రాక్టర్ల మధ్య తోపులాట జరగగా పోలీసులు వచ్చి ఇరువర్గాల వారిని సముదాయించారు… లోకల్ కాంట్రాక్టర్లకే ప్రాధాన్యమియాలని స్థానిక కాంట్రాక్టర్లు అంటుంన్నారు. ఓపెన్ టెండర్ కావడంతోనే టెండర్ వేయడానికి వచ్చామని కరీంనగర్ కు చెందిన లారీ కాంట్రాక్టర్లు అన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రైస్ మిల్లులకు ధాన్యం రవాణా చేయడం, గన్నీ బ్యాగుల టెండర్ల కోసం జిల్లా సివిల్సప్లయ్ అధికారులు ఓపన్ టెండర్ పిలిచారు. పెద్దపల్లి కలెక్టరేట్లోని సివిల్ సప్లయ్ ఆఫీసులో సోమవారం టెండర్లు వేయడానికి వచ్చిన కరీంనగర్ లారీ కాంట్రాక్టర్ పెద్దపల్లి,సుల్తానాబాద్ లారీ అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు. రెండు అసోసియేషన్ సభ్యుల నడుమ తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో సుల్తానాబాద్ లారీ కాంట్రాక్టర్ కరీంనగర్ లారీ కాంట్రాక్టర్ యొక్క టెండర్ పత్రాలను గుంజుకొని పారిపోయారు. ఈ క్రమంలో ఆందోళన తీవ్రం కావడంతో పోలీసులు చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం కరీంనగర్ లారీ కాంట్రాక్టర్ మరో సెట్ టెండర్ పేపర్లను కలెక్టర్కు అందజేశారు. ఈ సంరద్బంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లారీ కాంట్రాక్టర్ మాట్లాడుతూ టెండర్ల వెనుక బడాబాబులు ఉన్నారని, వాళ్లే నాన్ లోకల్ వాల్లతో టెండర్లు తక్కువకు వేయిస్తున్నారని ఆరోపించారు. నాన్ లోకల్ వాళ్లకు టెండర్లు దక్కేలా చేసి స్థానికంగా ఉన్న లారీ యజమానుల పొట్టలు కొట్టవద్దని
అధికారులను వేడుకున్నారు.