సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామం సర్వేనెంబర్ 27లో ఉద్రిక్తత నెలకొంది. తొమ్మిది ఎకరాల అసెంన్డ్ భూమిని నాలుగు పరిశ్రమలకు టీఎస్ఐఐసీ కేటాయించింది. పరిశ్రమలకు కేటాయించిన భూమిని బుధవారం చదును చేస్తుండడంతో గ్రామస్తులు రైతులు ఆందోళనకు దిగారు. గత కొన్ని సంవత్సరాలుగా నుండి కబ్జాలో ఉంటూ పంట పండించుకుంటున్న రైతులు మా భూములు మాకే కావాలంటూ నినాదాలు చేస్తూ పెద్దఎత్తున ఆందోళన చేస్తుండంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వందల సంఖ్యలో పోలీసులు చేరుకొని రైతులు, ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు పోలీసుల పరాహలో భూమిని చదును చేసారు.