సిరాన్యూస్ ,ఓదెల
ఈనెల 8న తెలంగాణ ఉద్యమ కారుల చైతన్య యాత్ర
తెలంగాణ ఉద్యమ కారుల ఫొరం మంథని డివిజన్ అధ్యక్షులు గోగుల రాజిరెడ్డి
ఈనెల 8న తెలంగాణ ఉద్యమ కారుల చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమ కారుల ఫొరం మంథని డివిజన్ అధ్యక్షులు గోగుల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈనెల 8న పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్‌లో నిర్వహించే తెలంగాణ ఉద్యమ కారుల చైతన్య యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ గుండేటి ఐలయ్య యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం , రాష్ట్ర కార్యదర్శి మంథని విజయ్ కుమార్, పార్లమెంటు కన్వీనర్ బత్తుల శంకర్ జాడి, జంపయ్య, గుర్రం దేవేందర్, ఓల బక్కయ్య, దొడ్డ లింగయ్య, కుడుదుల లక్ష్మీనారాయణ, కాజీపేట, సాంబయ్య పాల్గొన్నారు.