సిరా న్యూస్,ఆసిఫాబాద్;
ఆసిఫాబాద్ మండలం బూరు గూడ గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక (11) పై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పాఠశాల అనంతరం విద్యార్థులంతా ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఒంటరిగా వెళుతున్న విద్యార్థిని గమనించిన యువకుడు మద్యం మత్తులో బాలికను తన ఇంటికి బలవంతంగా తీసుకెళ్లి ఇంటి లోపల అఘాయిత్యానికి పాల్పడగా అటుగా వెళుతున్న ఇద్దరు వ్యక్తులు గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుని పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితున్ని ఫోక్సో చట్టం ద్వారా కఠినంగా శిక్షించి ఉరితీయాలని బూరుగూడ జాతీయ రహదారి పై బాధిత కుటుంబ సభ్యులతోపాటు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, గ్రామస్తులంతా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.