సిరా న్యూస్,నెల్లూరు;
కోవూరు పరిధిలోని స్టవ్ బీడీ కాలనీ, లక్ష్మీ నారాయణ పురం లో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. రూరల్ డిఎస్పిరి ఆద్వర్యంలో సిఐలు, ఎస్సైలు , సిబ్బంది, స్పెషల్ పార్టీలతో కలిపి సుమారు 150 మందితో ఆపరేషన్. సుమారు 1200 ఇళ్ళు తనిఖీ చేసారు. సరైన పత్రాలు లేని 50 బైకులు, 6 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. పది0 మంది రౌడీ షీటర్స్/సస్పెక్ట్ షీటర్స్ ఇళ్ళు తనిఖీ చేసారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాల నివారణ, శాంతి భద్రతలను పరిరక్షణ, అసాంఘీక శక్తుల ఏరివేతే లక్ష్యం. ప్రత్యేక కార్యాచరణ ద్వారా జిల్లాలో హింసాత్మక చర్యలు అరికట్టుటకు ప్రణాళికలు. జిల్లాలో అసాంఘీకకార్యకలాపాల నిర్మూలనకు కఠిన ఆదేశాలు.. అతిక్రమించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు నమోదు చేస్తామని అన్నారు.