సిరా న్యూస్,సికింద్రాబాద్..;
గాంధీ ఆస్పత్రి నుంచి రెండు రోజుల వయసు ఉన్న శిశువు అపహరణకు గురి కావడం తీవ్ర సంచలనానికి దారి తీసింది. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అపహరణకు శిశువు ఉదంతాన్ని కొద్దీ గంటల్లోనే ఛేదించి సురక్షితంగా శిశువును తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. నల్గొండ జిల్లా గుండాల మండలం మోత్కూర్ గ్రామానికి చెందిన సుభాన్, షాహినా భార్యాభర్తలు. వారికీ ఇద్దరు ఆడపిల్లలు. బాబు కోసమని మరల గర్భం దాల్చిన షాహినాకు నొప్పులు రావడంతో ఈ నెల 24న, ఉదయం గాంధీ ఆసుపత్రిలోని మాతా శిశు సంక్షేమ కేంద్రం (ఎంసీహెచ్)లో అడ్మిట్ చేశారు. అదే రోజు ఉదయం పదిన్నర గంటలకు బాబుకు జన్మనిచ్చింది. అయితే బుధవారం ఉదయం 11-30 గంటల సమయంలో షాహినాకు కొన్ని టెస్టులు చేయాల్సి ఉండడంతో బాబును అక్కడే వదిలేసి వెళ్ళింది. తిరిగి వచ్చేవరకు తన బాబు కనిపించక పోవడంతో ఆసుపత్రి వర్గాల సహాయంతో అవుట్ పోస్ట్ లో పిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఒక మహిళ బాబును అపహరించినట్లు గుర్తించారు.