సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరగడి గ్రామంలో గోన సంచిలో బాలిక మృతదేహం లభించింది.స్థానికుల వివరాల ప్రకారం అదిలాబాద్ జిల్లా చెందిన ప్రభాకర్ గత ఏడు నెలల కిందట కూలి పని కోసం వచ్చి తన కుటుంబం తో సూరారంలో నివాసం ఉంటున్నాడు .ఈ నెల 12 వ తేదీన తన కుమార్తె ఏం. జోష్ న (7) కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు పోలీసులు కేసు నమోదు చేశారు.మంగళవారం ఉదయం బాసర గడి గ్రామంలో గోన సంచిలో బాలిక శవమై కనిపించింది. సంఘటన స్థలానికి చేరుకొని మేడ్చల్ పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది