సిబ్బందికి ఘాటు హెచ్చరికలు
సిరా న్యూస్,బద్వేలు;
పులివెందుల పోలీస్ స్టేషన్ ను కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తనిఖీ చేసి స్టేషన్ లోని పలు రికార్డులను, పరిసరాలను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి పరిశీలించారు. పులివెందులలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాల విషయమై ఆయన స్వయంగా రంగంలో దిగినట్లు సమాచారం.పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పులివెందుల పట్టణంలో నెలరోజులుగా ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు దొంగతనాలను అరికట్టేందుకు కొన్ని ప్రణాళికలు చేపట్టారని అన్నారు. పాత నేరస్తులను విచారించడం వలన 9 పాత కేసులు విచారించగా నాలుగు లక్షల 50 వేలు నగదు రికవరీ అయిందని తెలిపారు. అందులో భాగంగా పటిష్టమైన చర్యలు చేపడతామన్నారు. పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐ లు, పోలీసులు పాల్గొన్నారు.