ఆలయ ఈవో
సిరా న్యూస్,యాదాద్రి;
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రసాదంలో వాడే నెయ్యి నాణ్యత బాగుందని ఫుడ్ సేఫ్టీ అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారని ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు.. యాదాద్రి కొండపై తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు విష యాలను వివరించారు. యాదాద్రీశుడి ప్రసాదంలో వినియోగించే నెయ్యిని పరిశీలించేందుకు ఇటీవల షాంపిల్స్ తీసుకెళ్లారని, వాటిని పరిశీలించిన తరువాత నాణ్యత బాగుందని అధికారులు వెల్లడించారని ఆయన పేర్కొ న్నారు. లడ్డూ తయారీతో పాటు ఇతర ప్రసాదాలకు ప్రతి రోజు వెయ్యి కిలోల నెయ్యిని వాడుతున్నామన్నారు. సంవ త్సరానికి రూ.15 కోట్ల విలువైన నెయ్యిని మదర్ డెయిరీ ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మదర్ డెయిరీ నుంచి 40 సంవత్సరాలుగా నెయ్యిని టెండర్ ధరల ప్రకారమే కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. నెయ్యి శాంపిలన్సు ప్రతి నెల పరీక్షలకు పంపుతామన్నారు. మదర్ డెయిరీ ద్వారా నెయ్యి కొనుగోలు టెండర్ వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు గడువు ఉందని, కానీ, ప్రభుత్వం విజయ డెయిరీ నుంచి నెయ్యిని వాడాలని ఆదేశించిందని చెప్పారు. విజయ డెయిరీ నెయ్యిని వాడాలా.. మదర్ డెయిరీ నెయ్యి వాడాలా అనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు..