యాదాద్రిలో నటుడు సుమన్ పూజలు

సిరా న్యూస్,యాదాద్రి;
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారిని సినీ నటుడు సుమన్ గురువారం దర్శించుకున్నారు. సుమన్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో కృషిచేసి యాదాద్రి ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయం అభివృద్ధి కాకముందు ఎలా ఉండేదో నాకు తెలుసు . ఎన్నో వ్యయ ప్రయాసలు గూర్చి కేసీఆర్ గారు ఈ ఆలయాన్ని చాలా అందంగా నిర్మించారు. ఎంతో మంది శిల్పులు పనిచేసే ఈ శిల్పాలను ,గోపురాలను చెక్కారు. ఈ గుడిలోపటికి వెళ్తే ఆధ్యాత్మిక ప్రపంచంలో కి వెళ్లినట్లు ఉంది.. ఇంత అద్భుతమైన గుడిని ప్రతి ఒక్కరు కాపాడుకోవాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *