-తల్లిదండ్రులను ప్రేమించడం అలవాటు చేసుకోవాలి
-చిగురు విద్యాసాగర్‌రావు ఆలోచన స్పూర్తిదాయకం
-మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
సిరా న్యూస్,మంథని;
కన్నవారి పేరున పేదవారికి సేవ చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు.
ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామంలో స్వర్గీయ చిగురు మధుసుధన్‌రావు 15వ వర్థంతి సందర్బంగా ఆయన కుమారుడు చిగురు విద్యాసాగర్‌రావు గ్రామస్తుల సౌకర్యార్థం నిర్మించిన వాటర్ ట్యాంక్, పశువుల దాహర్తీ తీర్చేలా నిర్మించిన ట్యాంకును ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ సమాజంలో అనేక మంది తమ తల్లిదండ్రుల పేరిట సామాజిక,స్వచ్చంద సేవలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే కొంతమంది తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలివేస్తున్న సంఘటనలు అక్కడక్కడా జరుగుతున్నాయని అన్నారు. తల్లిదండ్రులను ప్రేమించడం, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలని, తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడంలో ఎంతో సంతృప్తి ఉంటుందన్నారు. అడవిశ్రీరాంపూర్ వాసులకు తాగునీటి సమస్య తీర్చడంతో పాటు అనేక విధాలుగా ఉపయోగపడే విధంగా తన తండ్రి స్మారకంగా విద్యాసాగర్‌రావు వాటర్ ట్యాంకు నిర్మించడం చాలా గొప్పవిషయమని, ఆయన ఆలోచన స్పూర్తిదాయమకమన్నారు. ప్రతి ఒక్కరు కన్నవారి పేరున సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.