సిరా న్యూస్,కావలి;
నెల్లూరు జిల్లా కావలిలో కిడ్నాప్ కు గురైన 15 నెలల బాలుడిని పోలీసు లు 24 గంటల్లో పట్టుకున్నారు. బాలుడి ఇంటి ముందు ఉండే స్వరూప అనే మహిళ బాలుడిని ఎత్తుకెళ్లినట్లు సిసి ఫుటేజ్ ఆధారం గా గుర్తించారు. అనంతరం ఆమె కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. పొన్నవోలు వద్ద ఓ బస్సులో బాలుడునీ తీసుకె ళ్తుండగా మహిళను పట్టుకొని, అక్కడి నుంచి తీసుకొచ్చి డిఎస్పి శ్రీధర్ చేతుల మీదుగా తల్లిదం డ్రులకు అప్పజెప్పారు.