– ఆ భూమిని విశాఖలోని పాత్రికేయులకు కేటాయించాలి
– కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ విజ్ఞప్తి
– భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేత
-సిరా న్యూస్, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జగన్ మానవతా వాది కాదని బి.వి.రామ్ విమర్శ
విశాఖపట్నం;
హిందూ వాదినని శారదా పీఠాధిపతిని అంటూ మోసం చేస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి కు గత ప్రభుత్వం కేటాయించిన భూమిని.. కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ విజ్ఞప్తి చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న భూమి ని విశాఖలోని పాత్రికేయులకు కేటాయించాలని కోరారు. గత ప్రభుత్వంలో ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకున్నారు. ఇదే అంశమై శనివారం.. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు బి.వి.రామ్ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందూ మతం పేరుతో ప్రజల్ని నమ్మించి మోసం చేస్తున్న నయవంచకుడు ఎస్.ఎన్.పాల్ (స్వరూపానందేంద్ర సరస్వతి) అని రామ్ ఆరోపించారు. అతను గత వైసీపీ ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరించారని అన్నారు. అందుకే రామతీర్ధంలో శ్రీరామ విగ్రహానికి శిరచ్ఛేదం జరిగినా కనీసం స్పందించలేదని ప్రస్తావించారు. ఈ క్రమంలోనే వైయస్ జగన్ సర్కారు ఎస్.ఎన్.పాల్ కు భీమిలిలో 15 ఎకరాల భూమిని ధార దత్తం చేసిందని పేర్కొన్నారు. తాజాగా తిరుపతిలో లడ్డు అపవిత్రమైందని వార్తలు వినవస్తున్న నేపథ్యంలో కూడా కనీసం ఆయన స్పందించలేకపోయారన్నారు. అందుకే ఈ విషయంలో స్పందించాలని, అసలు హిందువో కాదో స్పష్టం చేయాలని తాను 48 గంటల గడువు ఇచ్చినా హిందుత్వాన్ని నిరూపించ లేకపోయారన్నారు. ఈ క్రమంలోనే స్వరూపానందేంద్ర సరస్వతి హిందువు కాదని భావిస్తూ అతని పేరును ఎస్.ఎన్.పాల్ గా మార్చివేశానని పేర్కొన్నారు. ఏది ఏమైనా అతనికి భీమిలి లో కేటాయించిన 15 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు.
జగన్ మానవతా వాది కాదు
పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి తను మానవతా వాదినని చెపుతుండడాన్ని బీవీ రామ్ తప్పు పట్టారు. జగన్ నిజంగా మానవతా వాది అయితే..మణిపూర్ మారణ హోమంలో పెద్ద సంఖ్యలో క్రిస్టియన్స్ బాధితులుగా మారినప్పుడు జగన్ మానవత్వం ఏమైందని ప్రశ్నించారు. వైయస్ జగన్ సోదరి షర్మిల చెబుతున్న విధంగా ఆయన క్రిస్టియన్ అయినప్పటికీ మణిపూర్ అంశంలో స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. మరో వైపు చెల్లెలు సునీతను ఎందుకు క్షోభ పెడుతున్నారని, సొంత బాబాయ్ వివేకానంద హత్య కేసు లో దోషులను.. ఐదేళ్లపాటు అధికారంలో ఉండి కూడా ఎందుకు గుర్తించ లేకపోయారని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిసిన వారులో టిడిపి 8 వ వార్డ్ అధ్యక్షుడు సిహెచ్.గోపి తదితరులు పాల్గొన్నారు.