మూసీ దుస్థితికి ప్రధాన కారణం కాంగ్రెస్.. బీఆర్ఎస్ పార్టీలే..?

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
 సిరా న్యూస్,హైదరాబాద్;
లండన్ సీయోల్ కాదు మూసీ బాధితుల వద్దకు వెళ్లే దమ్ముందా? మూసీ పునరుజ్జీవం అతి పెద్ద స్కామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సబర్మతి, నమామి గంగ తో మూసీకి పోలికా? సబర్మతి, నమామి ఖర్చు కు, మూసి అంచనాకు పోలిక ఎక్కడ? మీ అల్లుడి వాద్రా కోసం మూసీ దోపిడీకి ప్లాన్ చేస్తారా? కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తాం. మూసీ బాధితులకు మేం అండగా ఉంటామని అన్నారు. పేదల పక్షాన కాంగ్రెస్ నేతలను నిలదీస్తామని అన్నారు. ఇక్కడికి వచ్చిన జనాలని చూస్తుంటే మూసీ ప్రాజెక్టు ప్రారంభం కాదని అన్పిస్తోంది. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మేమంతా మీకు అండగా ఉంటాం. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి 287 కి.మీలు ప్రవహిస్తున్న మూసీ, డ్రైనేజీ నీటితో దాదాపు 12వేల పరిశ్రమల నుండి వెలువడే రసాయనాలతో విషంగా మారిన మూసీ. పాదయాత్రలో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో విషం చిమ్ముతూ ఎగిసిపడుతున్న మూసీని, జనం బాధలను కళ్లారా చూసిన. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్సే కారణం, మూసీ ప్రక్షాళన ఓ జోక్ 1997లో ప్రక్షాళన పేరుతో డ్రామాలు. కర్మన్ ఘాట్ లో నందనవనం 2005లో సేవ్ మూసీ క్యాంపెయిన్ పేరుతో హంగామా. నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ జైకా, జపాన్ నిధుల ఖర్చు. 2014 వరకు సమైక్య పాలనలో దోపిడి కొనసాగిందని అన్నారు. మూసీ పునరుజ్జీవం కోసం కాదు, దేశంలో సచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి పునరుజ్జీవింప చేసేందుకే తెలంగాణ సొమ్మును ఖర్చు చేయాలని చూస్తున్నరు. కాంగ్రెస్ దోపిడీని అడ్డుకుని తీరుతామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *