సిరా న్యూస్,కరీంనగర్;
కమీషనరేట్ పోలీసు హెడ్ క్వార్టర్స్ నుండి సైకిల్ ర్యాలీ ప్రారంభించిన కరీంనగర్ పోలీసు కమీషనర్ అభిషేక్ మొహంతి
పోలీసు అమరవీరుల సంస్మరనార్ధం సైకిల్ ర్యాలీ నిర్వహించిన కరీంనగర్ పోలీసులు.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా
శుక్రవారంనాడు కరీంనగర్ పోలీసు కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ నుండి సైకిల్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ, సమాజంలో శాంతిభద్రతల స్థాపనకు పోలీసులు చేస్తున్న కృషిపట్ల ప్రజలకు అవగాహన కలిగే విధంగా ఈ సైకిల్ ర్యాలీ ఉపయోగపడుతుందని భావిస్తున్నామన్నారు. కమీషనరేట్ లోని అన్ని విభాగాలకు చెందిన పోలీసు అధికారులతో పాటు నగరంలోని పలువురు సభ్యులు పెద్దసంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారన్నారు.
పోలీస్ హెడక్వార్టర్స్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ బస్ స్టాండ్ ఇన్ గేట్, ఇందిరా చౌక్, రాంనగర్ పాత లేబర్ అడ్డా మీదుగా, శివ థియేటర్ జంక్షన్, కెమిస్ట్రీ భవన్ మీదుగా, కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ చౌరస్తా, టవర్ సర్కిల్, శాస్త్రి రోడ్, త్రీ టౌన్ మీదుగా కమాన్ చౌరస్తా, వన్ టౌన్ పోలీసు స్టేషన్ తిరిగి బస్ స్టాండ్ మీదుగా పోలీసు హెడ్ క్వార్టర్స్ వద్ద ముగిసింది.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఏ ఆర్, అనోక్ జయ్ కుమార్ లతో పాటు ఏసీపీలు విజయ్ కుమార్ , మాధవి , నరేందర్ , వెంకటరమణ, కమిషనరేట్ లోని ఇన్స్పెక్టర్లు కోటేశ్వర్ , విజయకుమార్, జాన్ రెడ్డి, స్వామి , ప్రకాష్ గౌడ్ , రిజర్వు ఇన్స్పెక్టర్లు రజినీకాంత్, కుమార స్వామి, జానీమియా , శ్రీధర్ రెడ్డి, సురేష్ మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.