ఈనెల 28న జరుగు జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి

రాజీమార్గం రాజమార్గం
పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ
సిరా న్యూస్,సిద్దిపేట;
సమయాన్ని డబ్బులను ఆదాచేసుకోవాలి కక్ష కారుణ్యాలతో ఏమీ సాధించలేము, రాజీ పడితే ఇద్దరూ గెలిచినట్లేనని కరీంనగర్ పోలీసు కమిషనర్ బి అనురాధ అన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుంది. 28-09-2024 నాడు జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడ దగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, టెలిఫోన్ రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులో మరియు ఇతర రాజీ పడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు. రాజీ మార్గం రాజ మార్గమని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని డబ్బులను వృధా చేసుకోవద్దని, జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పోలీస్ అధికారులు కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ లు మరియు పోలీస్ సిబ్బంది రాజీ పడ్డ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *