పిడుగురాళ్ల మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

కరాలపాడు, చెన్నాయిపాలెం లో గ్రామ సభలు

సిరా న్యూస్,పిడుగురాళ్ల;
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలములోని కరాలపాడు, చెన్నాయపాలెం గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమము, గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామసభలో పిడుగురాళ్ల సహాయ వ్యవసాయ సంచాలకులు బి. శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, వ్యవసాయశాఖ అందించే వివిధ రకాల పథకాలు మరియు సేవల గురించి, రైతు సేవా కేంద్రాలలో ఎరువులు అందుబాటులో ఉంచుట మరియు పంటలలో వచ్చు చీడపీడల గురించి వాటి నివారణ చర్యల గురించి రైతులకు తెలియజేశారు.
మండల వ్యవసాయ అధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్క రైతు కూడా పంట నమోదు చేయించుకోవాలని, పంట నమోదు వలన ఉపయోగాలు మరియు పంటలబీమా గురించి తెలియజేశారు.
పిడుగురాళ్ల ఉద్యాన అధికారి వై.మోహన్ మాట్లాడుతూ, ఉద్యాన శాఖ అందించే వివిధ రకాల పథకాలు అయినటువంటి హైబ్రిడ్ వెజిటేబుల్ ప్రొడక్షన్, హార్టికల్చర్ ఏరియా ఎక్సపాన్షన్ ప్రోగ్రామ్ గురించి వివరించి, ఉద్యాన పంటల సాగుకు అందించే ప్రోత్సాహకాల గురించి వివరించారు. అలాగే, బిందు సేద్యం మరియు తుంపర సేద్యం పై ఉత్సాహం ఉన్న రైతులకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పరికరాలు సబ్సిడీలో అందిస్తారు అని కావలసిన రైతులు రైతు సేవా కేంద్రాలకి వెళ్లి తమ పేర్లు నమోదు చేయించుకోవాలి అని తెలియజేశారు. గ్రామసభ అనంతరం, క్షేత్ర సందర్శన చేయడం జరిగింది. వరి పొలాలలో శిలీంద్రం తెగుళ్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కార్బన్దజిమ్ 1గ్రాము/1లీటరు నీటికి లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు/1 లీటరు నీటికి లేదా సాఫ్ 330 గ్రాములు /1 ఎకరానికి పిచికారి చేసినట్లయితే గోధుమ రంగు మచ్చ మరియు అగ్గి తెగులు రాకుండా ఉంటాయి అని తెలియజేశారు. ఆకు చుట్టు పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఐదు శాతం వేప గింజల కషాయం లేదా అజాడిరెక్టిన్ 10000 పిపిఎమ్, 200 మిల్లీ లీటర్ల/ఎకరానికి లేదా క్లోరిఫైరిఫాస్ 500ఎంఎల్/ఎకరానికి లేదా కార్ట్ఆఫ్హైడ్రోక్లోరైడ్ 400గ్రాములు/ఎకరానికి పిచికారి చేసుకున్నట్లయితే ఆకు చుట్టు పురుగును కూడా నివారించుకోవచ్చు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరాలపాడు ఎం పి ఇ వో పి. వెంకటగోపి, గ్రామ పెద్దలు మరియు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *