సిరా న్యూస్,మహబూబాబాద్;
అకేరు వాగు నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల ను నెల్లికుదురు తహసీల్దార్ రాజు పట్టుకున్నారు. దాంతో రెచ్చిపోయిన ఇసుక రవాణాదారులు తహసీల్దార్ రాజు, రెవెన్యూ సిబ్బంది పై దాడికి ప్రయత్నం చేసారు. మముల్నీ ఎవరు ఏమి చేయలేరు అంటూ బూతు పురాణలతో వాగ్వివాదానికి దిగారు.
అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ తహసీల్దార్ రాజు, సిబ్బందితో గొడవ పడ్డారు. మా సంగతి మీకు తెలియదు అంటూ సిరియస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులే మా ట్రాక్టర్లు ఆపలేరు మీరెంత అంటూ దుర్భాషలడుతూ రెచ్చిపోయారు. దాంతో తాహశిల్దార్ ఇసుక మాఫియా టీం సభ్యులు పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. నెల్లికుదురు పోలీసులు కేసు నమోదు చేసారు.