పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం
-శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రాణాలను అర్పించిన పోలీసులకు ఘన నివాళులు
సిరా న్యూస్;
శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అను నిత్యం పోరాడుతున్నారు. మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే అది పోలీసులు అప్రమత్తంగా ఉండడం వల్లే. ఉగ్రవాదం, తీవ్రవాదం, అసాంఘిక శక్తుల నుంచి ప్రజలను కాపాడేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. అందుకే పోలీస్ శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సంఘవ్యతిరేక శక్తులతో పోరాడుతూ కొందరు పోలీసులు అసువులు బాసారు. అలాంటి అమరుల త్యాగాలు మరువలేనివి. వారిని స్మరించుకునేందుకు ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం ( పోలీస్ ఫ్లాగ్ డే) నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 21వ తేదీ పోలీసు శాఖలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న దినం. భారత చైనా సరిహద్దులోని లడక్ ప్రాంతంలో గల హాట్ స్ప్రింగ్స్ అనే ప్రదేశంలో 1959 అక్టోబర్ 21న చైనా సైనికులు దాడి చేసిన సంఘటనలో 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు నేలకొరిగారు. అప్పటి నుంచి వారిని స్మరించుకుంటూ ప్రతి యేటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల స్మారక దినంగా జరుపు కుంటూరు .విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం పోలీసు శాఖ పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపు కోవడం ఆనవాయితీగా వస్తుంది. విధి నిర్వహణలో తమ ప్రాణాలను పణంగా పెట్టి అమరులైన వారికి యావత్ పోలీసు శాఖ ఘనంగా నివాళులు అర్పించి, వారి ఆశయ సాధన కోసం పని చేస్తామని ప్రతిన భూనడానికి పోలీసుల అమరవీరుల దినోత్సవం వేదికగా నిలుస్తోంది. పోలీసు అమరవీరుల దినోత్సవ అవిర్భవం ఇలా: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది. మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాలైన లడక్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే మహత్తర బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) బలగాలు నిర్వర్తించేవి. 1959 అక్టోబర్ 21న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటిబుగ్గ అని అర్థం. కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి పవిత్రస్థలంగా రూపు దిద్దుకుంది. ప్రతి ఏడాదీ అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. పోలీసులు త్యాగాలు విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేము, వారిని స్మరించుకోవడం అందరి బాధ్యతనేర పరిశోధన, ప్రజల సంరక్షణలో పోలీసుల సేవలు అజరామమంమన కళ్ల ముందు నిత్యం ఏ కష్టం కలిగినా ముందుగా గుర్తొచ్చేది పోలీసు, ఖాళీ డ్రస్ ఖరుకుదనం ఉన్న వెనుకాల ఉన్నది మనిషే కాబట్టి వారందరికీ మర్యాద, గౌరవం, విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిత్యం పోలీసులు చేస్తున్న పోరాటాలు, వీరోచిత సాహస చర్యలను మనం చూస్తున్నాం వీరందరూ తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశంలోని కోట్లాది మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో జీవితాలు అంకితం చేసిన వారందరికీ పాదాభివందనం.