సిరా న్యూస్,అవనిగడ్డ;
వరద ముంపు నుంచి తేరుకుంటున్న గ్రామాల్లో అధికార యంత్రాంగ సేవలపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పునరావాస కేంద్రాల్లో వసతుల పట్ల వరద బాధితుల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శిబిరాల్లో తమకు మంచి భోజనం వడ్డిస్తున్నారని వరద బాధితులు తెలిపారు. కాగా అవనిగడ్డ నియోజకవర్గంలోని పునరావాస కేంద్రాలు, లంకలను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. దెబ్బతిన్న రోడ్లు అభివృద్ధి చేయాలని సూచించారు.