సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి జిల్లా చిర్లకూరు మండలం కమ్మవారిపాలెం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది, నవ మాసాలు మోసి జన్మనిచ్చి జీవిత చరమాంకంలో తోడుగా ఉంటాడనుకున్న కొడుకు కాలయముడయ్యాడు క్రూర మృగంలా మారి తల్లిని దారుణంగా కొట్టి చంపాడు,గురువారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో కొడుకు మనోజ్ (22సం”)ను తల్లి సుశీలమ్మ మందలించడంతో విచక్షణ కోల్పోయిన మనోజ్ క్రూర మృగం లా మారడు,కర్రతో తల్లి తలపై విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె తీవ్ర గాయాలు పాలయ్యారు, వైద్యం కోసం సుశీలమ్మను మొదట గూడూరుకు తర్వాత నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె మరణించింది,దీంతో చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు….