-కేంద్ర ప్రభుత్వానికి కులసంఘాల లేఖలు
సిరా న్యూస్,పెద్దపల్లి;
వక్ఫ్ బోర్డు పేరుతో అనేక యేళ్ళుగా నివాసముంటున్న పేదల భూములను దోచుకునేలా కాంగ్రెస్ పార్టీ చేసిన వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని ఆర్యవైశ్య సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ భూముల సవరణ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ బుధవారం లేఖలు పంపించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు ముస్త్యాల సంతోష్, పంపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన కుటిల రాజకీయాల వల్ల అనేక సంవత్సరాలుగా భూములకు యజమానులుగా ఉన్నప్పటికీ వక్ఫ్ చట్టం వల్ల ఆ భూములు తిరిగి ముస్లీములు బలవంతంగా లాక్కుంటునారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వక్ఫ్ బోర్డును రద్దు చేసి, సవరణ చట్టాన్ని అమలు చేయాలని లేఖల్లో వారు కోరారు. ఆర్యవైశ్య సంఘం తరపున దాదాపు వంద లేఖను పార్లమెంటు కౌన్సిల్ చైర్మనుకు పంపించారు.
I support WAQF BOARD bill to pass in parliament