సిరా న్యూస్,మహబూబాబాద్;
జిల్లాలో మంగళవారం జరిగిన ప్రజాపాలన వేడుకల్లో కస్తూర్బా టీచర్ల అత్యుత్సాహం
చూపించారు. టీచర్లు వేడుకలకు కస్తూర్బా విద్యార్థులను తరలించారు. సుమారు 200 మంది విద్యార్థినులను డిసిఎం వాహనంలో కలెక్టరేట్ కు తరలించారు. గూడ్స్ వాహనాలలో విద్యార్థులను పశువుల్లా కుక్కి మరీ తెచ్చారు. దీంతో విద్యార్దినీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మీడియా కంట పడడంతో డిసిఎం వాహనం దింపి ఆటోల్లో పాఠశాలకు తరలించారు. కస్తూర్బా టీచర్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.