మామీద అసత్య ప్రచారం చేస్తున్నారు…

సిరా న్యూస్,ఖమ్మం;

స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ సాయి గణేష్ నగర్ బాధితులు పోట్ల శ్రీనివాసరావు,భార్య మనీ మాట్లాడుతూ పెంతల మధు రెడ్డి శోభ రాణి కి శ్రీ సాయి గణేష్ నగర్ నెంబర్ 14 లో షాప్ నిమిత్తము రోడ్ సైడ్ కి షట్టర్ కిరాయికి ఇవ్వడం జరిగిందని . దానిలో వారు గత రెండు సంవత్సరాలు నుండి షాప్ నడుపుకుంటున్నారు . 4-07-2024 న పైన కిరాయికి ఉంటున్న రేణుక ఆడుకుంటున్న పిల్లవాణ్ణి పిలిచి కోతులను అదువాయించామని కోరింది . ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురైనాడు . ఆ పిల్లవాడు 5 ఫీట్ల ఐరన్ రాడ్ ను తీసుకువచ్చి కోతులను తరిమే క్రమంలో కరెంటు తీగలకు తగలడంతో ఈ ప్రమాద శాతం జరిగిందని అన్నారు . వాస్తవానికి కరెంటు తీగలు ఇంటికి దూరంగా ఉన్నాయి . పొడవాటి రాడ్డు తో కొట్టడం ద్వారా ఈ విధంగా జరిగిందని తెలియజేశారు . మేము ఆరోజు మహబూబాద్ ఉన్నాము . వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, బాబు నానమ్మ కోరిక మేరకు,
మా కాలనీ గ్రూపులో ఒక మెసేజ్ పెట్టి బాబుకు సహాయం అందించవలసిందిగా కోరినాము.దానికి స్పందించిన దాతలు వారికి తోచిన విధంగా సహాయం చేశారు, వచ్చిన మొత్తాన బాబు చికిత్స పొందుతున్న హాస్పిటల్ కి వెళ్లి వారికి అందజేయడం జరిగింది,
తర్వాత మరల 54000 రూపాయలు కూడా వచ్చాయి,దానికి నేను ఒక 50,000,బాబును పిలిచినందుకుగాను రేణుక ఒక లక్ష రూపాయలు కలిపి ఇద్దామని అనుకున్నాము,మధు రెడ్డి వాళ్లు మాకు ఆ మొత్తం అవసరం లేదు, మేము కేసు పెట్టుకుంటాము అని తెలిపారు ఇప్పుడు ఏమైందో తెలియదు కానీమా మీద అసత్య ప్రచారాలు చేస్తూ,మాకు ఇబ్బంది కలిగించే విధంగా మా దగ్గర డబ్బులు ఉన్నాయి వాటిని ఇవ్వవలసిందిగా ఒక్కోచోట ఒక్కోరకంగా మాట్లాడుతూ వారు కాలనీ గ్రూపులో 1 లక్ష రూపాయలు ఉన్నాయని , ఏసీపి దగ్గర వెళ్లి 2 లక్షలు అని , సిఐ దగ్గరికి వెళ్లి 5 లక్షలు అని , విలేకరుల సమావేశంలో 10 లక్షలు అని చెప్పి ఈ విధంగా రకరకాలుగా ప్రచారం చేసి మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు .
తరువాత శెట్టర్ ల గురించి మేము కూడా మానవత్వంతో వారి ఆరోగ్య , ఆర్థిక పరిస్థితి ని అర్థం చేసుకుని రెండు నెలలు ఆగాము . ఆ తర్వాత మీరు షాప్ నడుపుతారా ? లేదా కాళీ చేస్తారా ? అని అడగగా వారి నుండి ఎటువంటి స్పందన రాలేదు . కానీ మాకు జీవనాధారం ఆ షట్టర్ . అలాగే నా భార్య ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు స్ట్రెంత్ వేశారు వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్నామని వారికి పలుమార్లు చెప్పిన కానీ ఎటువంటి స్పందన లేదు . కావున మూడు రోజుల క్రితం వారికి తెలియజేసే సామాన్లు బయట పెట్టడం జరిగింది . వాటిలో 20 తుళ్లల్లో బంగారం ఉందని పోయిందని అబద్ధాలు చెబుతున్నారు . కొందరి వ్యక్తుల ప్రోత్సాహంతో నాతో సంబంధం లేని వ్యక్తుల పేర్లను ప్రసావిస్తూ మా పరువు ప్రతిష్టకు బంగం కలిగే విధంగా చేస్తున్నారని, న్యాయస్థానానికి వెళ్లి చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *