సిరా న్యూస్,ఖమ్మం;
ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది.ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సీతారామపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుండి సత్తుపల్లి చింతలపూడి మీదుగా చెక్కపల్లి వెళుతున్న శ్రీ కె.వి.ఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, నాసిక్ నుండి వైజాగ్ వెళుతున్న ఉల్లిపాయల లోడ్ లారీని ఓవర్టేక్ చేస్తూ ఉండగా, బస్సు లారీ వెనుక ఢీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
క్షతగాత్రులను చికిత్స కోసం పెనుబల్లి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ముగ్గురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.