సిరా న్యూస్,గన్నవరం;
ఉంగుటూరు మండలం తేలప్రోలు జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు గంజాయితో బ్యాగులు వదిలి పారిపోయారు. గంజాయి బ్యాగులతో ఏలూరు వైపు నుంచి విజయవాడ వస్తుండగా పోలీసులను చూసి గంజాయి రవాణా చేసే బ్యాచ్ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్కూరు పోలీసులు ఒక స్కూటీ, ఫోన్, రెండు గంజాయి బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి బ్యాగులు వదిలి పారిపోయిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు…..