సిరాన్యూస్, ఓదెల
కొండా లక్ష్మణ్‌బాపూజీ తెలంగాణకు నిత్యస్ఫూర్తి : ఎమ్మెల్యే విజయరమణ రావు
తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తన జీవితకాలం పోరాడిన తొలితరం నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన తెలంగాణకు నిత్యస్ఫూర్తి అని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పేర్కొన్నారు.ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పాల్గొని జిల్లా అధికారులు, నాయకులతో కలిసి కొండా లక్ష్మణ్ బాపుజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోదుడు తెలంగాణ ఉద్యమకారుడు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నామని తెలిపారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం నిబద్ధత తో పనిచేసి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. అతడిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నాడు తెలంగాణ కోసం మంత్రి పదవి కి రాజీనామా చేసి త్యాగం చేసిన మొట్టమొదటి నాయకుడు లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మన ప్రభుత్వ హయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు జిల్లా పద్మశాలి సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.