సిరా న్యూస్, ఇంద్రవెల్లి :
26న తుడుం దెబ్బ డివిజన్ నూతన కమిటీల ఎన్నిక..
తుడుం దెబ్బ జిల్లా నూతన అధ్యక్షులు పుర్క బాపూరవ్..
26న తుడుం దెబ్బ డివిజన్ నూతన కమిటీల ఎన్నిక నిర్వహిస్తున్నట్లు తుడుం దెబ్బ జిల్లా నూతన అధ్యక్షులు పుర్క బాపు రావ్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాులర్పించిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న తుడుం దెబ్బ మండల, డివిజన్ కమిటీలను రద్దు చేస్తూ తీర్మానించడం జరిగిందన్నారు. తిరిగి ఈ కమిటీలను ఈ నెల 26 తేదీన అమరవీరుల స్తూపం వద్ద నూతన కమిటీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికలకు తుడుం దెబ్బ రాష్ట్ర, జిల్లా నాయకులు 9 ఆదివాసి తెగల నాయకులు సార్ మేడిలు, పటేల్ లు అనుబంధ సంఘాల నాయకులు వచ్చి ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు తొడసం శంకర్, రామెళ్ళి బొజ్జన్న, గెడం భారత్ జిల్లా కార్యదర్శి పెందుర్ రఘునాథ్, భగవంత్ రావ్, అర్క రమణ, సొయం భీంరావ్, తదితరులు పాల్గొన్నారు.