సిరా న్యూస్,హుజురాబాద్:
మాట ఇవ్వడమే కాదు దాన్ని నిలబెట్టుకున్నప్పుడే నిజమైన లీడర్ అవుతాడని దానికి తగ్గట్టుగా పని చేసిన పెట్టిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వోడితల ప్రణవ్
గతంలో వర్షాలు కురిసినప్పుడు వరద ప్రవాహం అంతా
హుజురాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లోని బేడ బుడగ జంగాల కాలనీ లోని గృహాలకు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇట్టి విషయం తెలుసుకున్న ప్రణవ్ అక్కడ నివసించే ప్రజలు మా కాలనీ యొక్క అవస్థలు చూడమని తెలుపగా స్పందించిన త్వరలోనే మీ కాలనీకి తగిన సాయం చేస్తాననిమాట ఇవ్వడం జరిగింది.ఇచ్చిన మాట ప్రకారం బుధవారం రోజున ఆ కాలనీలో మొరం పోయించి చదును చేపించారు. భారీ వర్షాలు కురుసిన ప్రతీ సమయంలో కాలనీ అస్తవ్యస్తం
అవుతుందని,ఇన్నాళ్లుగా తమ కాలనీనీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడనీ, సమస్య చెప్పిన కొద్దిరోజుల్లోనే పరిష్కారం కృషి చేసినందుకు కాలనీవాసులు జీవితాంతం రుణపడి ఉంటామని అంటున్నారు.
రాజకీయాలకతీతంగా సమస్యల పరిష్కార విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని ఇలాగే కొనసాగి మా సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు. కొన్నేళ్లుగా పరిష్కారం కానీ సమస్యలను కూడా మానవతా దృక్పధంతో చేస్తున్నాడని పలువురు కాలనీ వాసులు అభిప్రాయప డుతున్నారు.