ఎవరికి వారే.. యమునా తీరే…

కమలంలో నేతల కవ్వింతలు
సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ప్రజా సమస్యలు పట్టవా? మత విధ్వేషాల మీద వున్న శ్రద్ద ప్రజా సమస్యల పరిష్కారంపై ఉండదా?.. రోజుకొక వివాదంతో రచ్చ చేస్తోన్న నేతల తీరు మారదా? ఒకరు హిందువులపై నోరు పారేసుకుంటే మరొకరు సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తుంటారు. సొంత పార్టీ కార్యలయం ఉండగా.. దాన్ని వదిలేసి ప్రెస్ క్లబ్‌ను నమ్ముకుని రాజకీయం చేస్తుంటారు. ఇక ఎప్పుడో మొదలైన పాత, నేతల మధ్య రచ్చకి తెర పడదు. దాంతో తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ కంటున్న కలలు నెరవేరే పరిస్థితే లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.బీజేపీ ఆ పార్టీకి ప్రధాన బలం కులం, మతం సెంటిమెంట్లు.. అందుకే ఆ పార్టీలో ఎంట్రి ఇచ్చిన వారందరూ హిందుత్వ అస్త్రంతోనే రాజకీయం చేయాలని చూస్తుంటారు. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. పదవులు లేని నేతలే కాదు, బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా అదే వాయిస్ వినిపిస్తుంటారు. గతంలో మసీదులు తవ్వితే శవాలు వస్తే మీకు శివ లింగాలు వస్తే మాకు అంటూ సంచలన వాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన కేంద్ర మంత్రి బండి సంజయ్ నుంచి నేటి నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అరవింద్ వరకు విద్వేషాలతో కూడిన ప్రసంగాలతో వివాదాలకు అడ్రెస్ గా నిలుస్తున్నారు.మత మీటర్ లేనిదే కిలో మీటర్ నడవలేని నేతల్లో రాజాసింగ్, బండి సంజయ్ లు ముందుంటారు. గల్లీ లీడర్ ఏం మాట్లాడినా చెల్లుబాటై ఉండొచ్చు. కానీ ఒక గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నమనే సోయి లెకుండా నోటికొచ్చింది మాట్లాడుతున్న తీరు ఆ పార్టీలో దుమారం లేపుతున్నాయి. హిందుత్వం ముసుగున రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం తప్ప, రాజాసింగ్, బండి సంజయ్ కు ఏం తెలియదనే విమర్శలు వస్తున్నాయి. మంత్రి పదవిలో వుండి నోటికొచ్చింది మాట్లాడటాన్ని ఏమంటారో బండి సంజయ్‌కు కాకపోయిన ఆ పార్టీ హైకమాండ్ కైనా తెలియాలి కదా అని అన్ని పార్టీల నుంచి విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా తీరు మారలేదనే టాక్ వినిపిస్తోంది. ఇట్లాంటి మత మీటరు కలిగిన నేతలకు గౌరవప్రదమైన పదవులు అప్పగించడం పట్ల బీజేపీజాతీయ నేతలు కూడా ప్రత్యర్ధులకు టార్గెట్ అవుతున్నారు.హైదరాబాద్ పేరు మారుస్తాం. మజీదులు తవ్వితే శవాలు వస్తే మీకు, శివ లింగాలు వస్తే మాకు వంటి మాటలు మనుషుల మధ్య విధ్వేషాలు పెంచుతాయి తప్ప.. మీ పార్టీ మైలెజ్ పెరుగుతుందని అనుకోవడం అవివేకమే అవుతోంది తప్ప మరోకటి కాదన్న విమర్శలు వస్తున్నాయి. రెండు సార్లు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన బండి సంజయ్ పై ఇటు పొలిటికల్‌గాను.. కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న తీరుపై అన్ని వర్గాల్లోను వ్యతిరేకత వస్తుంది.ప్రభుత్వాన్ని పడగొడుతాం, ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారంలోకి వస్తాం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి వుంటే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపించే వాళ్ళం, కేసీఆర్ఆస్తులను జప్తు చేసేవాళ్లం, కవిత బెయిల్ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యి అభిషేక్ మనుసింగ్ ను తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపించారనే ప్రకటనలు చేసి ఆయన నవ్వుల పాలయ్యారనే టాక్ వినిపించింది. అంతేకాదు కవిత బెయిల్ వచ్చిన రోజే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని బండి సంజయ్ నోరు పారేసుకుని, సుప్రీం కోర్ట్ పరువు తీశారనీ, ఆయనను వెంటనే హోశాఖ సహాయ మంత్రి పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు కూడా వినిపించాయి.సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ ఏపీసోడ్లో ఆ పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్లే పైడీ రాకేష్ రెడ్డి హిందువులకు చీము నేత్తురు లేదా, గాజులేసుకుని కూర్చొన్నారా అనే రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఇక మాధవి లత రూటే సపరేట్. మాటకు ముందు, మాటకు వెనక సనాతనం, హిందుత్వం తప్ప ప్రజలు, ప్రజా సమస్యలు అనే ముచ్చటే వుండదనే టాక్ ఉంది. ముత్యాలమ్మ టెంపుల్ అంశంలో ఒక కేంద్ర మంత్రి సమగ్ర విచారణ జరగాలని అంటారు, ఇంకో కేంద్రమంత్రి వెళ్లి నోరు పారేసుకుంటున్నారు. బీజేపీ చేస్తేనే హిందుత్వ యాగాలా..? పూజలా..? మిగిత ఎవరు చేసినా అవి హిందుత్వ యాగాలు పూజలు కాదా..? బీజేపీ నాయకులే హిందువులా ఇంకేవరు హిందువులు కాదా అనే ప్రశ్నలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.తాజాగా ఆ పార్టీ నిజమాబాద్ ఎంపీ ధర్మాపురి అరవింద్ ఆ జాబితాల్లోకి చేరారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ ఎపిసోడ్ లో స్పందించిన ఆయన నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకు రాజస్థాన్ లో ఒకర్ని గొంతు కోసి చంపేశారనీ, దాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గొంతులు కోసే పద్దతిని ప్రోత్సహిస్తారా..? లేక బీజేపీ అధికారంలో వున్న రాస్ట్రాలలో గుడులు, మజీదులు, చర్చీలు దాడులకు గురికావడం లేదా అన్న ప్రశ్నలకు అరవింద్ సమాధానం చెప్పాలంటున్నారు. అంతేకాదు బీజేపీ ఎంపీనని మర్చిపోయినట్లు సొంత పార్టీపైనే నిప్పులు చెరిగిన ఆయన దెబ్బకు ముత్యాలమ్మ ఎపిసోడ్ సైడ్ అయిపోయింది.మొత్తం మీదా బీజేపీలో ప్రజా ప్రతినిధులు వివాదాస్పద వాఖ్యలతో అసలే అంతమాత్రంగా ఉన్న పార్టీ పరువును మరింత బజారున పడుస్తున్నారని కాషాయ కేడర్ అసహనం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో పుంజుకోవాలని పార్టీ పెద్దలు కంటున్న కలలు కల్లలుగానే మిగిలిపోతాయంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *