-నేడు భగినీ హస్త భోజనం

సిరా న్యూస్;
-సోదరీమణులకు భగినీ హస్త భోజన శుభాకాంక్షలు.
భగిని’ అంటే…చెల్లెలైనా కావచ్చు., అక్క అయినా కావచ్చు.‘హస్తభోజనం’ అంటే… చేతి భోపెండ్యాలజనము అని అర్ధం. అంటే.. సోదరి చేతివంట సోదరుడు తినడం అన్నమాట. ఇందులో కొత్త విషయం ఏముందని మీరు అడగచ్చు. సాధారణంగా వివాహమైన చెల్లెలు, అక్క ఇంటిలో తల్లిదండ్రులుగానీ., అన్నదమ్ములుగానీ భోజనం చేయడానికి ఇష్టపడరు. కారణం తినకూడదని కాదు. ఆడపిల్ల ఋణం ఉంచుకోవడం పుట్టింటివారికి ఇష్టం ఉండదు. శుభసందర్భాలలో., శుభకార్యాలలో వచ్చి భుజించినా తప్పులేదు కానీ., ఊరికే వచ్చి తినడం మర్యాద కాదని మన సాంప్రదాయం. కానీ కార్తీక శుద్ధ విదియనాడు మాత్రం వివాహం అయిన సోదరి ఇంటిలో సోదరుడుభుజించితీరాలని శాస్త్రం నిర్ణయించింది. దీనికి ఓ కథ కూడాఉంది. ఆ కథ ఏమిటంటే…. సూర్యభగవానునకు సంధ్యాదేవి వలన కలిగిన సంతానంలో యముడు, యమున ఒకరు. ‘యమునకు’ అన్నయ్య ‘యముడు’ అంటే ఎంతో ఇష్టం. యమునకు కూడా అంతే. యముడు తన చెల్లెలును ప్రేమగా ‘యమీ’ అని పిలిచేవాడు. యమునకు వివాహం జరిగింది.అత్తవారింటికి కాపురానికి వెళ్లింది. ఒకరోజు యమునకు తన అన్నను చూడాలని కోరిక కలిగింది. తన ఇంటికి విందుకు రమ్మని యమధర్మరాజుకు వర్తమానం పంపింది. విందుకు వస్తానని యమధర్మరాజు యమునకు మాట ఇచ్చాడు.అ రోజు అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ చేసి అన్నయ్య రాకకోసం ఎదురుచూస్తూ కూర్చుంది యమున. ఎంతసేపయినా అన్నయ్య రాలేదు. ఈ రోజు పని వత్తిడి వల్ల రాలేకపోతున్నానని, ‘కార్తీక శుద్ధ విదియ’ నాడుతప్పకుండా విందుకు వస్తానని చెల్లెలికి వర్తమానం పంపాడు యమధర్మరాజు.యమున సంతోషించి ఆ రోజున కూడా తన అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ తయారుచేసింది. అన్నమాట ప్రకారం యమధర్మరాజు చెల్లెలు ఇంటికి విందుకు వచ్చాడు. యమున తన అన్నయ్య నుదుట పవిత్ర తిలకం దిద్ది, పూలమాల వేసి తను చేసిన పదార్థాలన్నీ అన్నకు కొసరి కొసరి వడ్డించి ప్రేమగా తినిపించింది. చెల్లెలు అనురాగానికి ముగ్ధుడైన యమధర్మరాజు ఏ వరం కావాలో కోరుకో’ అని అడిగాడు. ‘ప్రతి యేడు ఇదే కార్తీక శుద్ధ విదియనాడు తన ఇంటికి విందుకురావాలనీ, అలాగే ప్రతి సోదరుడు ఈ రోజున తన సోదరి చేతి భోజనం భుజించాలనీ’ వరం కోరుకుంది యమున. యమధర్మరాజు ఆ వరాన్ని యమునకు అనుగ్రహించాడు. అలాగే ఎవరైతే ఈనాడు సోదరి ఇంట్లో భోజనం చేస్తారో వారికి నరలోక ప్రాప్తి కాని , అపమృత్యు భయం కానీ ఉండకుండా చూడమని వరం అడగగా యముడు వరం ప్రసాదించాడుఅందుకే ఈ రోజున ప్రతి సోదరుడు వివాహం అయిన తన సోదరి చేతి భోజనం చేయాలని శాస్త్రం నియమం విధించింది. ఆ నియమం ఇప్పటికీ చాలా చోట్ల కొనసాగుతోంది.- మహారాష్ట్రలో ఈ పండుగను ‘భయ్యా-దుజ్’ అని పిలుస్తారు.- నేపాల్ ప్రాంతంలో ఈ పండుగను ‘భాయి-టికా’ అని పిలుస్తారు.- పంజాబ్ ప్రాతంలో ఈ పండుగను ‘టిక్కా’ అని పిలుస్తారు.మరుసటిరోజున అన్న చెల్లెలిని భోజనానికి పిలవాలి. దీనిని ‘సోదరి తృతీయ’ అంటారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *