సిరా న్యూస్,పార్వతీపురం మన్యం;
గిరిజన సంక్షేమ మంత్రి సంధ్య రాణి జిల్లాలో గిరిజనులు కష్టాలు తీరడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా గిరిజన గ్రామాల్లో గిరిజనుల తలరాతలు మాత్రం మారడంలేదు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో సకాలంలో వైద్య సేవలు పొందలేని దుస్థితి నెలకొంది. కొమరాడ మండలం సీసాడవలస గ్రామానికి చెందిన నికిత అనే గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో 108 వాహనం గ్రామానికి వచ్చే పరిస్థితి లేక స్థానికులు యువత మంచం పైన ఆమెను తీసుకువచ్చారు.