సిరా న్యూస్,అమలాపురం;
తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలంటూ గోవింద నామ కీర్తనల భజనతో బండారులంకలో నిరాహార దీక్ష జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా బండారులంకలో నిరాహార దీక్ష హిందూ యువత చేపట్టింది. తిరుమల లడ్డును అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలంటూ అమలాపురం రూరల్ మండలం బండారు లంకలో నిరాహారదీక్షకు దిగారు. గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట నిరాహారదీక్ష చేపట్టారు. దీక్షాశిబిరం వద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి గోవింద నామ కీర్తనలతో భజనలు చేస్తూ నిరాహారదీక్ష చేసారు. తక్షణమే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూని ఆ పవిత్రం చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేసారు. నిందితులను వెంటనే శిక్షించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించారు.