సిరా న్యూస్,ఇచ్చోడ
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందుతుడిని ఉరితీయాలి : తుడుం దెబ్బ రాష్ట్ర కన్వీనర్ కొడప నగేష్
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడిని ఉరితీయాలని తుడుం దెబ్బ రాష్ట్ర కన్వీనర్ కొడప నగేష్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని కొమరం భీం కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఇటీవల ఓ ఆదివాసి మహిళపై అత్యాచారం, హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తికి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటుచేసి ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఆదివాసులపై ఎదురు దాడికి దిగిన ముస్లిం, మైనార్టీల పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, హత్యయత్నం కేసులు నమోదు చేయాలని అన్నారు. ఆదివాసీ మహిళకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఖర్చులతో కార్పొరేట్ వైద్యాన్ని అందించి వెంటనే బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బిరుదు గోండు తోటి సంగాం జిల్లా అధ్యక్షులు నైతం శేఖర్, బోథ్ డివిజన్ కో కన్వీన్నర్ ఆత్రం మహేందర్, సిడం మురళీకృష్ణ, కాత్లీ విట్టల్, సిడం సునీల్ జేవైఎస్, మండల నాయకులు కొట్నాక్ జంగు, చాహకటి పవన్, మండల పరిధిలో ఉన్న వివిధ గ్రామాల పటేల్ లు పాల్గొన్నారు.