Tudum Dabha Kodapa Nagesh: నిందితుడికి ఉరిశిక్ష విధించాలి:  తుడుం దెబ్బ రాష్ట్ర కన్వీనర్ కొడప నగేష్

సిరాన్యూస్, ఇచ్చోడ‌
నిందితుడికి ఉరిశిక్ష విధించాలి:  తుడుం దెబ్బ రాష్ట్ర కన్వీనర్ కొడప నగేష్
* ఎస్సైకి విన‌తి ప‌త్రం అంద‌జేత‌

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని దేవునిగూడ గ్రామానికి చెందిన ఆదివాసి మహిళపై అత్యాచారం, హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తికి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఉరిశిక్ష విధించాలని ఆదివాసీ సంఘాల మహిళలు డిమాండ్ చేశారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై నరేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దెబ్బ రాష్ట్ర కన్వీనర్ కొడప నగేష్ మాట్లాడుతూ. అత్యాచారం, హత్యాయత్నానికి గురైన బాధిత మహిళ కుటుంబానికి పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఖర్చులతో కార్పోరేట్ వైద్యాన్ని అందించాలని అన్నారు. ఆ బాదిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి బంధువులు ఆదివాసులపై భౌతిక దాడులకు పాల్పడ్డ వారిపై వెంటనే చట్టరీత్య చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు, ఆదివాసీ మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *