పాడి కౌశిక్ రెడ్డి
సిరా న్యూస్,హైదరాబాద్;
బ్రోకర్ వి నువ్వా నేనా. టిడిపిలో గెలిచి బాబును మోసం చేశావని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ లో గెలిచి కేసిఆర్ ను మోసం చేశావు. మిస్టర్ గాంధీ గుర్తు పెట్టుకో..సిఎం అవుతా అని చెప్పుకున్న ఈటెల ను బొంద పెట్టిన మొగొన్ని నేనని అన్నారు. నేను తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డను. నీవు ఎక్కడ నుంచో వచ్చి నాకు సవాల్ చేస్తే ఊరుకుంటనా. శంబీపూర్ రాజు నేతృత్వంలో గాంధీ ఇంటికి వెళతాం. జిల్లా బిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అంతా రావాలని పిలుపునిస్తున్న. కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావు అనుమతితో చెబుతున్నా. నీకు నాకు ఏమైనా తగాదాలు ఉన్నాయా? నీకు నాకు ఏం పంచాయితీ.
బీఆర్ఎస్ బి ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లడానికి సిగ్గు అనిపించడంలేదా . నువ్వు మోగొడివి ఐతే రాజీనామా చేసి మళ్లీ గెలువని అన్నారు. అక్కడే నీ బలం, మా బలం ఏంటో తేల్చుకుందాం. అప్పుడు మోనగాడివి అని ఒప్పుకుంటా. బి ఆర్ ఎస్ లో ఉంటే తెలంగాణ భవన్ కు రా. ప్రెస్ మీట్ మాట్లాడి కేసిఆర్ వద్దకు వెళదాం. కాంగ్రెస్ లో చేరితే రాజీనామా చెయ్యి. గాంధీ మా ఇంటికి వస్తె స్వాగతిస్తానని అన్నారు.