తోపుడు బండ్లు, పూల అంగళ్ళు,బైకులు ధ్వంసం
సిరా న్యూస్,రావూరు;
నెల్లూరు జిల్లా రాపూరు లో మద్యం మత్తులో మౌలా అనే ఆటో డ్రైవర్ బుధవారం రాత్రి హాల్ చల్ చేశాడు,దింతో పలు దుకాణాలు,తోపుడు బండ్లు దెబ్బతిన్నాయి..రాత్రి సమయంలో జనాలు రోడ్లు మీదా లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది, మౌలా టాటాఏస్ ఫ్యాసింజర్ ఆటో లో పుటుగా మద్యం సేవించి ఆటో నడిపి బీభత్సం సృష్టించాడు. పూల దుకాణాలు, పళ్ళు అంగళ్లు, తోపుడు బండ్లును ఢీ కొనడంతో బండ్లు మీద వున్న పళ్ళు,ఇతర సరుకు రోడ్డు మీద పడిపోవడంతో చిరు వ్యాపారులకు నష్టం కలిగింది,అలాగే పార్క్ చేసిఉన్న పలు బైకులు ను ఢీ కొనడం తో బైక్ లు దెబ్బతిన్నాయి. స్థానికులు మద్యం మత్తులో వున్న ఆటో డ్రైవర్ మౌలా ను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు.