సిరా న్యూస్, సైదాపూర్:
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి : టీయూపీఎస్ నాయకులు సుధాకర్
* తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేత
ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని (టీయూపీఎస్) తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు సుధాకర్ అన్నారు. సోమవారం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ మంజులకు వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయ సంఘం నాయకులు సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా డీఏ, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు పరిష్కారం అవుతాయని పది నెలలుగా ఎదురుచూస్తున్న పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక చెల్లింపులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో శ్రీకాంత్ రావు, శివకుమార్, నరసింగం, విజయ్ కుమార్ పాల్గొన్నారు.