VNIV TP Ramanna:వివేకానంద క‌ళాశాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి : వీఎన్ఐవీ రాష్ట్ర అధ్యక్షులు టీపీ రామన్న

సిరాన్యూస్, కళ్యాణదుర్గం
వివేకానంద క‌ళాశాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి : వీఎన్ఐవీ రాష్ట్ర అధ్యక్షులు టీపీ రామన్న
* కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయం ఎదుట‌ వీఎన్ఐవీ నాయ‌కుల‌ ధర్నా

మరేంపల్లిలో ఉన్న వివేకానంద ప్రవేట్ డిగ్రీ, జూనియర్ కాలేజీ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి నిరుద్యోగుల ఐక్య వేదిక (వీఎన్ఐ వీ )ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు టి పి రామన్న మాట్లాడుతూ శ్రీ బాలాజీ విద్యా సంస్టుల సొసైటీ ధనర్జనే ద్యేయంగా పనిచేస్తున్నాయని అందుకు నిదర్శనమ‌న్నారు. వివేకానంద డిగ్రీ , జూనియర్ కాలేజ్ లే ఈ కాలేజ్‌లో పాఠాలను బోదించే ప్రవేట్ లెక్చ‌ర‌ర్స్‌ నాలుగు నెలలుగా జీతా భత్యాలు ఇవ్వకుండా లెక్చ‌ర‌ర్స్‌ ను మాన‌సికంగా వేదనకు గురి చేస్తూ, వారిని శ్రమ దోపిడీ చేస్తున్నార‌ని ఆరోపించారు.యూజీసీ నిబంధనల ప్రకారం కాకుండా చాలా తక్కువ వేతనాలు ఇస్తూ వారిని నిలువదోపిడి చేస్తున్నార‌న్నారు. అన్ని విద్యా సంస్థలలో ఈపీయాప్, ఈ హెచ్ ఎస్ ఈ హెచ్ ఎఫ్ వంటివి కల్పిస్తున్న శ్రీ బాలాజీ విద్యా సంస్థల సొసైటీలో నిరుద్యోగుల హక్కు గా రావాల్సిన వి కూడా ఇవ్వడం లేద‌న్నారు. పనిచేస్తున్న ప్రవేట్ లెక్షలర్ లకు జీతాలు, ఈ పి యఫ్ వంటివి కాలించాలని కోరుతూ డిమాండ్ ల తో కూడిన వినతి పత్రాన్ని ట్రైని కలెక్టర్ బి. వినూత్నకు అంద‌జేశామ‌న్నారు. కార్యక్రమంలో సందీప్, శివకుమార్, భరత్, ప్రకాష్, దిలీప్ బాలు,నిరుద్యోగులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *