సిరా న్యూస్,నల్గొండ;
నేరేడుచర్ల లోని ప్రధాన చౌరస్తాలో ఆదివారం రాత్రి మిర్యాలగూడ నుండి వస్తున్న బొలెరో వాహనం అతివేగంగా వస్తు ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసుకున్న పండ్ల దుకాణంపై కి దూసుకు వెళ్ళింది. ఈ ఘటనలో పండ్ల దుకాణం వద్ద నలుగురికి గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన 108 లో ఆసుపత్రికి తరలించారు. పొనుగోడుకు చెందినదిగా అనుమానిస్తున్న వాహనం ప్రధాన కూడలి వద్ద జనసంచారం రద్దీగా ఉన్న సమయంలో వేగంగా రావడం.. పండ్ల దుకాణం పైకి దూసుకు వెళ్లడం..పక్కనే స్ట్రీట్ ఫుడ్ నిర్వహిస్తున్న ప్రాంతంలో పదుల సంఖ్యలో జనం అల్పాహారం స్వీకరిస్తున్న సమయంలో ఇలా జరగడంతో స్థానికులు ఆందోళన చెందారు.అయితే తృటి ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పండుగ సీజన్ కావడం ప్రధాన చౌరస్తా వద్ద పోలీసులు నియమించకపోవడంతో తర చుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.