సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో రెండు ద్విచక్ర వాహనాలు ఘోరంగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకోగా తీవ్ర గాయాలైన మరో వ్యక్తిని వైద్యం కోసం తరలించారు.
కారేపల్లి మండలం గుట్ట కింద గుంపుకు చెందిన భార్యాభర్తలు సూర్యనారాయణ (58) సుగుణ (50)…. మరో ద్విచక్ర వాహనంపై వస్తున్న శ్రీకాకుళం కు చెందిన వెంకటేష్ (32) మృతి చెందారు. మృతుల్లో…వెంకటేష్ సింగరేణి సోలార్ ప్లాంట్ లో టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు.. సూర్యనారాయణ మేషన్ వర్క్ చేస్తుంటాడు.
ప్రమాదం జరిగిన వెంటనే తీవ్ర గాయాలతో ఉన్న ముగ్గురిని భద్రాద్రి జిల్లా ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే వారు మృతి చెందారు…. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరొకరిని వైద్యం కోసం ఖమ్మం తరలించారు.