సిరా న్యూస్,విశాఖపట్నం;
ఆనందపురం మండలం గుమ్మడివానిపాలెం హైవే వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనందపురం నుంచి పెందుర్తి వెళ్తున్న బైక్ రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో రోడ్డు దాటుతున్న వ్యక్తి, బైక్ పై కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మరొకరికి తీవ్ర గాయాలుకాగా అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కేసును ఆనందపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.