సిరా న్యూస్,మాచర్ల;
నాగార్జున సాగర్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పోలీసుల వలయంలో వుంది. సాగర్ ప్రాజెక్ట్ పై ఏపి-తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. సాగర్ డ్యాం వద్ద కు 1600 ఏపి పోలీసులు చేరుకున్నారు. మరోవైపు, తెలంగాణ పోలీసు బలగాలు కుడా సాగర్ ప్రాజెక్ట్ కు భారీగా చేరుకున్నాయి. సాగర్ ప్రాజెక్ట్ వద్ద పరిస్థితిని తెలంగాణ నీటి పారుదుల శాఖ సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్ ర్వాల్ శుక్రవారం సమీక్షించారు. గత రెండు రోజులుగా సాగర్ లోనే పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి మకాం వేసారు. గురువారం నిన్న సాగర్ కుడికాలువకు బలవంతంగా తాగునీటిని విడుదల చేసి ఏపి జనవరుల శాఖ నెగ్గించుకుంది.