సిరా న్యూస్,మెట్ పల్లి;
ఎస్సారెస్పీ శ్రీ కోదండ రామాలయ మెట్ పల్లి, నూతన కార్యవర్గ సభ్యులను సోమవారం రోజున ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. . 28 మందితో కూడిన నూతన కమిటీ కాలపరిమితి మూడు సంవత్సరాలు ఉంటుందని ఆలయ కమిటీ తెలిపారు. దీనికి నూతన కమిటీ గౌరవ అధ్యక్షులు గా ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్, ఎస్సారెస్పీ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ మరియు ఎస్సారెస్పీ క్యాంపు కార్యాలయం వారు బాధ్యతలు వహిస్తారు. నూతన అధ్యక్షులుగా జువ్వాడి నర్సింగారావు, ఉపాధ్యక్షులుగా జెట్టి లింగం, చెట్లపెళ్లి సుఖేందర్ గౌడ్, ఎర్రోళ్ల హనుమాన్ యాదవ్, యామ రాజయ్య, మాన్కాల గంగాధర్ మరియు ప్రధాన కార్యదర్శిగా బల్గు కాశీ రావు , జెట్టి లక్ష్మణ్, సహాయ కార్యదర్శులుగా నేమూరి లక్ష్మణ్, ఇల్లెందుల శ్రీనివాస్, సలహాదారులుగా నేరెళ్ల దేవేందర్ , ఎల్ముల రాంబాబు, క్యాషియర్ గా పబ్బ లింబాద్రి మరియు కమిటీ కార్యవర్గ సభ్యులుగా బోయిని ప్రవీణ్, గుర్రాల ప్రకాష్, సుతారి బాలరాజు, సుతారి లింగారెడ్డి, బొడ్ల ఆనంద్ , బొడ్ల శ్రీనివాసు, ఎదులాపూర్ కుమారస్వామి, చేని రమేష్ , నేరెళ్ల నారాయణ, బొడ్ల రమేష్, తోట ప్రవీణు, చింతల శ్రీకర్ గౌడ్ , సుంకేటి విజయ్, చాడ చందు , ఆర్మూర్ లక్ష్మీనారాయణ , కల్లెడ నారాయణ, ర్యాగల అశోక్ , తోపారం నాగయ్య, ఖమ్మం నాగరాజు, మనోజు, గుండ్ల హరీష్, కొండ అరుణ్, పుల్లూరి వెంకటేశ్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. అనంతరం ఏకగ్రీవ ఎన్నికలకు సహకరించిన కార్యవర్గ సభ్యుల అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఎన్నికైన వారు తెలిపారు. ఇట్టి నూతన కార్యవర్గ సభ్యులను పలువురు అభినందించారు.